సమతుల ఆహరం(balanced diet) ప్రాముఖ్యత మరియు ఉపయోగాలు

సమతుల ఆహారం

అంటే ఏమిటి? | క్యాలోరిస్ |  సమతుల ఆహరం యొక్క అవసరం|   ఉపయోగాలు | Healthy eating guidelines | Summary 

అంటే ఏమిటి?

మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు  సరైన మోతాదులో ఉన్న ఆహారాన్ని సమతుల ఆహరం అని అంటారు. అన్ని పోషకాలు అంటే

1. కార్బోహైడ్రేట్స్

2. ప్రోటీన్స్

3. ఫ్యాట్స్

4. విటమిన్స్

5. మినరల్స్

ఇవి అన్ని ఉన్న ఆహారాన్ని సమతుల ఆహరం అని అంటారు. 

రోజు మన శరీరానికి కావలసిన పోషకాలు మరియు క్యాలోరీస్  మనకు తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, కాయలు నుండి లభిస్తాయి.

పండ్లు:

·         పండ్లు మన శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తాయి. సీజనల్గా లభించే పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.

·         పండ్లలో మనకు షుగర్  కూడా ఎక్కువగా ఉంటుంది కానీ అది సహజంగా లభించేది కాబట్టి ఇబ్బంది ఉండదు. అలాగే పండ్లలో పీచు పదార్థం మరియు ఖనిజ లవణాలు ఉంటాయి. అవి మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్  మరియు యాంటీ యాక్సిడెంట్లను అందిస్తాయి. (డయాబెటిస్ ఉన్న వారు డాక్టర్ని సంప్రదించి వారు చెప్పిన విధంగా పండ్లను తీసుకోవాలి.) 

కూరగాయలు :

·         మన శరీరానికి అవసరమైన విటమిన్లుమినరల్స్, మరియు యాంటీ యాక్సిడెంట్లను అందిచడంలో కూరగాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వివిధ రకాల రంగులలో లభించే కూరగాయలు తినడం వలన మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి.

·         ఆకుకూరలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి వారంలో కనీసం 3 సార్లు ఐన ఆకుకూరలు తినాలి.

·      లోకల్గా మరియు సీజనల్గా దొరికే కూరగాయలు తక్కువ ధరకు లాభిస్తాయి మరియు పోషకాలు కూడా ఉంటాయి  కాబట్టి వాటిని వండుకుని తినడం చాలా సులభం.

ప్రోటీన్స్:

·         గింజలు(చిక్కుడు లేదా మరేదైనా) మరియు మాంసాహారం నుండి మనకు ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ప్రోటీన్ గాయాలు మానడంలో, కండశాతం పెంచడంలో బాగా తోడ్పడుతుంది.

·         నట్స్, బీన్స్మరియు సోయా ప్రొడక్ట్స్ నుండి మనకు కావలసిన ప్రోటీన్స్, ఫైబర్,మరియు ఇతర పోషకాలు లభిస్తాయి.


 క్యాలోరిస్:  

   ఒక ఆహార పదార్థంలో ఉన్న క్యాలోరీస్ ఆహార పదార్థంలో ఉన్న శక్తిని సూచిస్తాయి. ఆహరం ద్వారా మనం తీసుకున్న క్యాలోరీలను మన శరీరం వివిధ పనులకు అనగా నడవటం, మాట్లాడటం, శ్వాస తీసుకోవటం, ఆలోచించటం వంటి వాటికి ఉపయోగిస్తుంది.

   ఒక సాధారణ మనిషికి తన రోజువారీ పనులకు సుమారు 2,000 క్యాలోరీస్ అవసరం అవుతాయి. అలాగే వయసు, లింగభేదం, మరియు చేసే పనులను బట్టి క్యాలోరీస్ అనేవి మారుతూ ఉంటాయి. ఆడవారితో పోల్చుకుంటే మగవారికి ఎక్కువ క్యాలోరిస్ అవసరం అవుతాయి

 

సమతుల ఆహారం యొక్క అవసరం:

·         మన శరీరం చక్కగా పనిచేయడానికి కావలసిన అన్ని పోషకాలను సమతుల ఆహరం అందిస్తుంది. మన శరీరానికి పోషకాలు సరిగా అందనప్పుడు శరీరం త్వరగా అనారోగ్యానికి గురవటం, బరువు పెరగటం, పనితీరు మందగించటం వంటివి జరుగుతాయి.

·         పిల్లలకు సరైన పోషక ఆహరం అందకపోతే అది వాళ్ళు పెరుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే వాళ్ళు తరచు అనారోగ్యాలకు కూడా గురవుతారు.

 

ఉపయోగాలు:

1. సరైన పోషకాహారం తీసుకోవడం వలన మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, శరీరం పనిచేసే తీరు మెరుగవుతుంది, వ్యాధినిరోధక వ్యవస్థ మరింత బలపడుతుంది మరియు అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది.

2. మన శరీరానికి కావలసిన సూక్ష్మ పోషకాలు అన్ని చక్కగా అందుతాయి. దాని వలన పోషకాహార లోపం వలన వచ్ఛే సమస్యలు తగ్గుతాయి.

3. కొన్ని రకాల వ్యాధులు అనగా డయాబెటిస్, క్యాన్సర్ మరియు గుండె జబ్బులు  రాకుండా నియంత్రించడానికి సమతుల ఆహరం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే హై బ్లడ్ ప్రెషర్ని కూడ తగ్గించటంలో బాగా సహాయపడుతుంది.

4. బరువు నియంత్రించటంలో మరియు అధిక బరువు తగ్గించటంలో బాగా సహాయపడుతుంది.

 

Healthy Eating Guidelines:

Ø  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు ఏమిటంటే పూట ఆహారాన్ని తీసుకోకుండా ఉండకూడదు. సాధారణంగా మనం ఉదయం అల్పాహారం(బ్రేక్ఫాస్ట్), మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం చేస్తాము. మధ్యలో ఒకటి లేదా రెండు సార్లు స్నాక్స్ తీసుకుంటాము. ముఖ్యంగా ఉదయం అల్పాహారాన్ని తీసుకోకుండా వుండకూడదు. ఎందుకంటే రోజు మొదలయ్యాక మనం మొదటిగా మన శరీరానికి ఇచ్ఛే ఆహరం.

Ø  బాగా ఉడికించిన ఆహరం కంటే ఉడికించకుండా తీసుకునే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే తాజా పండ్లు, కూరగాయలతో చేసే జ్యూస్లు , సలాడ్లు లాంటివి.

Ø  మనకు ఎప్పుడైతే కడుపు నిండినట్టు అనిపిస్తుందో అప్పుడిక తినడం ఆపేయాలి. దీనివలన బరువు నియంత్రణలో ఉంటుంది.

Ø  ఎక్కువగా మంచినీరు త్రాగుతూ ఉండాలి.

Ø  ఒకే రకం ఆహారాన్ని కాకుండా, రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకే ఆహరం నుండి మనకు కావలసిన పోషకాలు అన్ని లభించవు.

Ø  ప్రతి రోజు 5 నుండి 7 రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

Ø  కాఫీ, టీ మరియు చెక్కర ఎక్కువగా తీసుకోకూడదు.

Ø  అప్పుడప్పుడు ఒకపూట లేదా రెండుపూటలు భోజనం తినకుండా ఉపవాసం చేస్తే అది ఆరోగ్యానికి మంచిది

 Summary:

 ఆహారంలో ఎక్కువ శాతం మొక్కల నుండి వచ్చినటువంటి  అనగా తాజా పండ్లు, కూరగాయలు మరియు ప్రోటీన్  ఎక్కువగా లభించే పదార్థాలు తీసుకోవాలి. అలాగే ప్రొసెస్డ్ చేసినటువంటి ఆహారానికి దూరంగా ఉండాలి.  ఈ విధమైన డైట్ ను తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Comments

Post a Comment